ఎడపల్లి మండలంలో భక్తి శ్రద్దలతో,వేదపండితుల మం త్రోచరణల మధ్య కొలువుదీరిన గణ నాయకులు…. ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు…

 

 

ఎడపల్లి,సెప్టెంబర్ 14: (ప్రజా గళం)

వినాయక చవితి పండుగ సందర్భంగా ఎడపల్లి మం డల కేంద్రంతో పాటు గ్రామ గ్రామాన గణ నాయకులు సోమవారం కొలువుదీరాయి.ఎడపల్లి గ్రామంలోని పాత గ్రామంలోగల సార్వజానిక్ గణేష్ మండలి ఆధ్వర్యం లో వీర హనుమాన్ ఆలయం నుండి డప్పు వాయిద్యా లు,డిజె భక్తి పాటలతో గణనాథులను ఊరేగింపుగా ట్రాక్టర్ లో తీసుకెళ్లారు.యువకుల కేరింతలు,నృత్యా లతో గణ నాథులను గణపతి మండపాలకు ఊరేగిం పుతో బయలుదేరి వెళ్లారు.గణేష్ మండపాలల్లో వేద పండితుల మంత్రోచ్చారణాలతో గణ నాయకులను ప్రతిష్టించారు.అలాగే శివాలయం,విరభద్ర గణేష్, మండలాల్లో భక్తితో గణపయ్యలను ప్రతిష్టించారు

ఈ రోజు నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు,11 రోజుల పాటు ప్రజలు భక్తితో ప్రత్యేక పూజలు,అభిషేకలు,భజనలు,భక్తి పాటలు నిర్వహిస్తారు.ఎడపల్లి గ్రామంలోని నయాబాది లోని జై హనుమాన్ సార్వజానిక్ గణేష్,కుమార్ గల్లీలోని మహాలక్ష్మి గణేష్,తదితర మండపాలలో గణ నాథులు కొలువు దీరాయి.మండలంలో అంబం(వై),ఎఆర్పీ క్యాంప్,బ్రాహ్మణపల్లి,వడ్డేపల్లి,దుబ్బా తాండా,ధర్మారం, జమలం,జైతాపూర్,బాపునగర్,ఎంఎస్సి ఫారం, పోచారం,జాన్కంపేట్,నెహ్రూనగర్,ఠాణాకలాన్,కుర్నాపల్లి,మంగల్ పాడ్ గ్రామాలలో గణ నాథులు భక్తి శ్రద్దల మధ్య కొలువుదీరాయి.14 తేదీ నుండి 25 తేదీ వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి..

Leave A Reply

Your email address will not be published.