హంతకుడు రియాజ్ ను ఎన్ కౌంటర్ చేయడం,సత్య భామ నరకాసురుడిని వదించినట్లయింది…బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్….నిజమైన దీపావళిగా భావిస్తూ టపాసులు పెల్చిన బిజెపి నాయ కులు ….

ఎడపల్లి,అక్టోబర్ 20: (ప్రజా గళం)

నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నింది తుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో ఎడపల్లి మండలంలో ప్రశంసలు వెల్లువెత్తాయి.ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షు డు కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఆనందోత్సాహలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్ ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున బాణ సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా బిజెపి జిల్లా ఉపాధ్య క్షుడు కందగట్ల రాంచందర్ మాట్లాడుతూ..అలనాడు నరకాసురుడిని సత్యభామ వధించినట్లు,నేడు రియా జ్ అనే హంతకుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి వధిం చడం నిజమైన దీపావళిగా పండుగను జరుపుకుంటు న్నట్లు తెలిపారు.మొన్న రియాజ్ అనే హంతకుడు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేయడం హేయమైన చర్య అని అన్నారు.అందుకు ప్రత్యుత్తరంగా పోలీసులు రియాజ్ ని ఎన్ కౌంటర్ చేయడం చాలా సంతోషకారమని,నేడు నిజమైన దీపావళిగా భావిస్తున్నామని అన్నారు.రానున్న కాలంలో ముష్కరులు ఎవరైన ఇలాగే దాడులు చేస్తే పోలీసులు వారికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.ప్రజల రక్షణ కోసం,శాంతి భద్రతల కై 24 గంటలు పని చేసే ఒక కానిస్టేబుల్ నే హత్య చేయడం చాలా సిగ్గు మాలిన చర్య అన్నారు. పోలీస్ నే చంపడం(హత్య చేయడం)పట్ల ప్రజలు అంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని అన్నారు.పటిష్టమైన పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నాడని అన్నారు.అందుకు పోలీసులు పన్నాగం చేసి హంతకు డు రియజ్ ని పట్టుకుని ఈ విధంగా ఎన్ కౌంటర్ చేయ డం సంతోషదాయకమని అన్నారు.ఈ ఎన్ కౌంటర్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ సమర్ధి స్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి,బిజెవైఎం, నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.