బోధన్ ప్రతినిధి,అక్టోబర్ 20: (ప్రజా గళం)
ఈనెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారు ణంగా హత్య చేసిన హంతకుడు,రౌడీ షీటర్ రియాజ్ ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని హర్షం వ్యక్తం చే స్తూ బోధన్ పట్టణంలోని తట్టి కోట్ గల్లిలోని ప్రధాన కూడలి వద్ద బిజెపి శ్రేణులు,పోలీస్ అభిమానులు బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబ రాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా బిజెపి బోధన్ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడు తూ..చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసే వారికి పోలీసులు సరైన శాస్తీ చేశారని అన్నారు.ఎన్ కౌంటర్ రూపంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి న్యాయం జరిగేలా చేసినటువంటి పోలీస్ వారికి బోధన్ ప్రజల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ,చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ఇలాంటి చర్యలు సరియైనదని పోలీసులకు సెల్యూట్ తెలుపుకుంటూ పోలీసు వ్యవస్థ మీద ప్రజల కి గౌరవం పెరుగుతుందని జై పోలీస్ జై జై పోలీస్ తెల పడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో గొడుగు ధర్మపురి,వినోద్ చిన్న,ఎనుగంటి గౌతం, రవీందర్,సాగర్,లింగం,అనిల్, దత్తు,కిరణ్, శ్రీకాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

