నిజామాబాద్ జనవరి 8 ( ప్రజా గళం)
అత్యధిక శబ్దంతో పాటలు పెట్టి నడుపుతున్న వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వివరాలను వన్ టౌన్ ఎస్ హె చ్ఓ రఘుపతి తెలిపారు.
నిజామాబాద్ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో అత్యధిక శబ్దంతో పాటలు పెట్టి ఆటో నడిపిన వ్యక్తి ని అందులోకి తీసుకున్నామన్నారు. నగర శివారులోని ఆటోనగర్కు చెందిన షేక్ ముజామిల్ ను . పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి రఘుపతి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్ను బుధవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం జరిగిందన్నారు.. ఆటో నడిపిన వ్యక్తి షేక్ ముజం మిల్ కు న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధించడంతో సదరు వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.
