బాన్సువాడ టౌన్, ప్రజా గళం:
మోసపూరిత, మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, తెరాస నాయకులు బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెరాసా ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. బాన్సువాడ అంబేద్కర్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జుబేర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి, అబద్ధపు హామీలు ఇచ్చిందని, రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా న్యాయం జరగడం లేదన్నారు. రైతు భరోసా కు ఎకరాకు 15000, రైతు కూలీలకు 12,000, వెంటనే అందించాలన్నారు. మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు గణేష్, ఎర్రవట్టి సాయిబాబా, గౌస్, మహేష్, రమేష్ యాదవ్, దత్తు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

