బాల భరోసా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. శారీరకవైకల్యాలను ముందుగానే గుర్తించండి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ.

నిజామాబాద్ వైద్య విభాగం మే 1 (ప్రజాగళం)

 

బాల భరోసా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం విభాగo ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా లో భాగముగా బాల భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంభించారు

ఈ కార్యక్రమములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.రాజశ్రీ ,జిల్లా సంక్షేమాధికారిణి పద్మ ,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మోహన్ రావు , జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.అశోక్ ,సి డి పి వో లు,సూపర్ వైజర్ లు , మెడికల్ హెల్త్ టీం డాక్టర్ లు, ఆర్ బి ఎస్ కె సిబ్బంధి , లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, పిల్లలలో (0-5 సంవత్సరాలు) అభివృద్ధిలో జాప్యాలు, నాడీ సంబంధిత

అభివృద్ధి సమస్యలు, శారీరక వైకల్యాలను ముందుగానే గుర్తించడానికి ఉద్దేశించిన బాల భరోసా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ,ఈ కార్యక్రమo విజయవంతం కావడానికి మహిళా శిశు సంక్షేమ శాఖా ,ఆరోగ్య శాఖా సమన్వయము తో పనిచేయాలని జిల్లా వైద్య శాఖా అధికారిణి రాజశ్రీ సూచించారు. అభివృద్ధిలో జాప్యాలు, నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు మరియు శారీరక వైకల్యాలను ఉన్న పిల్లలకు చికిత్స అందించడానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి పూర్తి సహాకారం ఉంటుందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మోహన్ రావు చెప్పారు. డిస్ట్రిక్ట్ ఇమ్యు నై జేషన్ ఆఫీసర్ డా అశోక్ మాట్లాడుతూ మే నెలలో సెలవులు ఉన్నాయని ఆర్ బి ఎస్ కె టీం లు స్క్రీనింగ్ చేయడానికి అంగన్వాడీ టీచర్ లు అందరూ సహకరించాలని కోరారు.ఈ స్క్రీనింగ్ లో భాగంగా ఏదైనా సమస్య తో గుర్తించబడిన పిల్లలకు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని 4వ అంతస్తు లో ఉన్నటువంటి జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం లో స్పీచ్ మరియు పిజియో థెరపీలు మరియు చికిత్సలు ఉచితంగా అందించబడును. అలాగే నవజాత శిశువు నుండి 18 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం లో భాగంగా మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ పాటశాలలో ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ చేయించి ఏవైనా సమస్యలు ఉన్న విద్యార్థులకు ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం లో పుట్టుకతో వచ్చే లోపలకు, దంత సమస్యలకు, అనీమియా, పోషకాహార లోపలకు, గుండె సంబంధిత వ్యాధులు, చిన్నారుల్లో అన్ని రకాల శస్త్ర చికిత్సలకు, దంత సమస్యలకు, కంటి సమస్యలకు, చర్మ వ్యాధులకు, తదితర వ్యాధులకు చికిత్సలు చేయించబడునని జిల్లా వైద్య శాఖ అధికారిణి డా. రాజశ్రీ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.