ఎడపల్లి,జూలై 30: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నే షనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినం సందర్బంగా గురు వారం ఎడపల్లి గ్రామంలో పేద ప్రజలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఎడపల్లి గ్రామంలోని స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి అలాగే కొత్త బస్టాం డ్ సమీపంలో వున్న పేదలకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా 80 మందికి అల్పా హార వితరణ చేయడం జరిగింది అని,లయన్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ..లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నే షనల్ డైరెక్టర్ బాబురావు ఇలాంటి పుట్టినరోజు వేడుక లను ఇంకా అనేకం జరుపుకోవాలని,నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.మీరు ఇచ్చిన స్పూర్తితో మేము ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమా లు నిర్వహించడంలో ముందుటామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జిఎంటి కో-ఆర్డినే టర్ సూర్యనారాయణ,ఎడపల్లి క్లబ్ అధ్యక్షుడు ఎన్. రాకేష్ వర్మ,కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్,కోశాధికారి కాశినాథ్, డిసి.గంగారెడ్డి,పుష్పలత,డిసి.మెర్సీ,ప్రకాష్, శంకర్,తదితరులు పాల్గొన్నారు.

