నిజామాబాద్ సిటీ , ఆగష్టు 7( ప్రజాగళం )
నిజామాబాదు రూరల్ నియోజకవర్గంలోని
కాలూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు కెజిఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 3 గ్రీన్ బోర్డ్ లను విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో కెజిఎఫ్ సంస్థ వ్యవస్థాపకులు టైక్వాండో మనోజ్, అధ్యక్షులు డా. విజయ్, కార్యదర్శులు నాగేందర్, వెంకటేష్, జైపాల్ పాల్గొన్నారు.
మూడు గ్రీన్ బోర్డు లను స్థానిక కార్పొరేటర్ భోజన్న చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ కు అందజేశారు.ఈ సందర్బంగా కేజీఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు అండగా నిలబడటం కేజిఎఫ్ ప్రథమ కర్తవ్యమని ఇలాంటి ప్రతి పాఠశాలలో సహాయ సహకారాలు నిర్విరామంగా అందిస్తామన్నారు.ఈ సందర్భంగా కాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది కెజిఎఫ్ స్వచ్ఛంద సంస్థ సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

