ఎడపల్లి,ఆగస్టు 11: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఠాణాకలాన్ గ్రామంలో ఐదు రోజు ల పాటు భక్తి శ్రద్దలతో నిర్వహించిన ఊర పండగ ఉత్స వ వేడుకలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఊర పండుగ వేడుకలు మొదటిరోజు ముడుపులు వేయడం జరిగింది,రెండో రోజు ఆరు ఎత్తడం జరిగింది, మూడవరోజు దేవతలను ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది,సారగమ్మ,ఊరడమ్మ,ఆరేళ్ల మైసమ్మ ఆల యాల దగ్గర పోతరాజుల విన్యాసాలు,ఆట పాటలు భక్తిని పెంపొందించాయి.గ్రామ ప్రజలు ఐదు రోజుల ఊర పండగ వేడుకల్లో పాల్గొని గ్రామ దేవతలకు తమ మొక్కులు చెల్లించుకున్నారు.పండగ వేడుకలు గ్రామం లో సంతోషం,ఆనందాలతో,డప్పు చప్పుళ్ల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్బంగా గ్రామ ప్రజలు ఊర పండగను ఘనంగా నిర్వహించారు. నాలుగవ రోజు మహాలక్ష్మి పండుగ చేశారు.చివరిగా ఐదవ రోజు మైసమ్మ పండుగ,మహాలక్ష్మి మందిరం దగ్గర గ్రామ ప్రజలందరికీ భోజన కార్యక్రమాలు చేపట్ట డం జరిగింది.గ్రామ అభివృద్ధి కమిటీ,గ్రామ ప్రజల సహకారంతో గ్రామ సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఊర పండగను అత్యంత భక్తి శ్రద్దల తో గ్రామ ప్రజలు,పెద్దలు అందరు ఐక్యతతో విజయ వంతం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్,ఉపసర్పంచ్ చింతలవారి రవి,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకుల సురేష్,ఉపాధ్యక్షు డు గుండా శ్రీనివాస్,క్యాషియర్ గెంటే శ్రీనివాస్,సలహా దారులు పాల్ద రాజ రెడ్డి,మాజీ సర్పంచ్ అబ్బయ్య,బిళ్ల అనీల్ రెడ్డి,సూర కిరణ్,ఇస్సపల్లి గంగారాం(లడ్డు), కమలాకర్ రెడ్డి,సాకలి సంతు,గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

