నిజామాబాద్ వైద్య విభాగం ఆగస్టు 12 (ప్రజా గళం )
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితం కోసం పాటుపడాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు జరిగే అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఎయిడ్స్ పై ఐఐఈసీ తీవ్రతరమైన విజ్ఞాన సమాచారం- అవగాహన కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునే క్యూఆర్ కోడ్ (Break free aap)పోస్టర్ ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశానుసారం హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణలో భాగంగా… ఈ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.రాజశ్రీ మాట్లాడుతూ ఈ కార్యక్రమము బుధవారం నాడు ప్రారంభమై రెండు నెలల పాటు జిల్లాలో కొనసాగుతుందని ఇందులో భాగంగా 200 కళాశాల, పాఠశాల విద్యార్థులకు , 200 ఎంపిక చేసిన గ్రామాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనిపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత అవగాహన కొరకు బైక్ ర్యాలీని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ
కార్యక్రమంలో డా. దేవి నాగేశ్వరి టిబి నియంత్రణ అధికారి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సికందర్ నాయక్ ,ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ,హెల్త్ ఎడ్యుకేటర్ గన్ పూర్ వెంకటేష్ , డీపీఎం సుధాకర్,సిపిఓ మోహిజ్ అహ్మద్ , సి ఎస్ ఓ నవీన్ స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య,,డిపిఓ విశాల, హెచ్ఈఓ గోవర్ధన్, నాగరాజు,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ,వివిధ స్వచ్ఛంద సంస్థలు స్నేహ సొసైటీ, వర్డు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వై ఆర్ జి నుండి సిబ్బంది పాల్గొన్నారు.

