నడిపల్లి తండాలో ఘనంగా తీజ్ పండుగ

 నిజామాబాద్ రూరల్ ఆగస్టు 16 ( ప్రజాగళం )

డిచ్ పల్లి మండలం నడిపల్లి తండాలో ఘనంగా తీజ్ పండుగను ఆదివారం నిర్వహించారు.

బంజారుల కట్టుబొట్టు సంస్కృతీ సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తున్నది. గిరిజనుల ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. గిరిజనులు (బంజారులు) నిర్వహించుకునే ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏడాది శ్రావణమాసంలో తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. గిరిజన సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునే పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సందడి నడిపల్లి తండాలో ఘనంగా నిర్వహించారు.పెండ్ల్లికాని యువతులు తొమ్మిదిరోజులపాటు భక్తిశ్రద్ధలతో మట్టిని, మొలకలను ఆరాధిస్తారు. బంజారా మహిళలు, యువతుల ఆటపాటలు, నృత్యా లు, డప్పుల మధ్య భక్తిభావంతో తొమ్మిదిరోజులపా టు ఉపవాసాలు ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వర్షా లు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పడాలని, తండాలు, గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవద్దని కోరుతూ పూజిస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతి, యువకులు, తండా పెద్దమనుషులు, నాయక్ కార్ భారీ, సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.