హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్.

ఆర్మూర్ ఆగస్టు 21 ( ప్రజాగళం)

పాఠశాల ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్యకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి రాజశేఖర్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలో పీ డి ఎస్‌యూ ఆధ్వర్యంలో బీసీ హస్టల్‌ విద్యార్థులతో కలిసి ర్యాలీగా నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా వరకు కొనసాగిన ర్యాలీ. విద్యార్థులు కొవ్వుత్తులతో రూపరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు.

మానవహారంగా ఏర్పడి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా డియర్ ఫౌండేషన్ చైర్మన్ కీరవత్రి రాజశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రూపరెడ్డి దారుణ హత్య అత్యంత దారుణమన్నారు. సమాజానికే తలవంపులు తెచ్చే ఘటనాని, విద్యను దీపంలా పంచిన గురువుకే ఇలా జరగడం అందరిని కలచివేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు నరేంధర్, నిఖిల్, వచన, ఈఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.