బాన్సువాడ, ఆగస్టు 21, ప్రజా గళం :
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం బాన్సువాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారా యణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. నిధులు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని, పేద, మధ్యతరగతి కుటుం బాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదు వులను మధ్యలోనే నిలిపి వేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయం లో ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ అందించి ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తా మని హామీ ఇచ్చి, అధికారం లోకి వచ్చిన తర్వాత హామీ లను నెరవేర్చడం లేదని విమర్శించారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించ డంలో ప్రభుత్వం విఫల మైతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు.విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించలేని ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, ఉమేష్, బీజేపీ రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్, నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు హనుమాన్లు, బీర్కూర్ మండల అధ్య క్షుడు సాయికిరణ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు తృప్తిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

