బోధన్ చెక్కి క్యాంప్ 33/11 కెవి సబ్ స్టేషన్ లో అదన పు 5 ఎంవిఎ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించిన నిజామా బాద్ ఎస్ఈ.పివి.రాజేశ్వర్ రావు…విద్యుత్ అధికలోడ్ తగ్గించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సర ఫరా చేసేందుకు అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు.. ఎస్ఈ వెల్లడి…

 

బోధన్ ప్రతినిధి, ఆగస్టు 25: (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెక్కి క్యాంప్ లో 33/11 కె.వి సబ్ స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న 5 ఎంవి ఏ పవర్ ట్రాన్స్ఫర్మర్ తో పాటు అదనముగా ఏర్పాటు చేసిన మరొక 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫర్మర్ ను మంగళ వారం నిజామాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ ఈ)పి వి.రాజేశ్వర్ రావు ప్రారంభించారు.అలాగే సిబ్బం ది,వినియోగదారుల సౌకర్యార్థం బోధన్ టౌన్ 2 నూత న సెక్షన్ కార్యాలయ భవనాన్ని ఎస్ఈ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎస్ఈ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ..వినియోగధారులకు,నాణ్యమైన,నిరంతరాయ విద్యుత్ సరఫరా కొరకు,అధిక లోడ్ తో ట్రిప్పింగ్స్ కాకుండా అంతరాయాలు తగ్గించడానికి టిజి ఎన్ పిడిసిఎల్.సిఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ప్రస్తుతం ఉన్న 5 ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ కు అదనంగా మరొక 5 ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ ను మంజూరు చేశారని తెలిపా రు.ఈ సందర్బంగా మంజూరు చేసిన ట్రాన్స్ ఫార్మర్ ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి,ఈరోజు ప్రారంభిం చుకోవడం జరిగింది అని సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ రావు తెలిపారు.అలాగే చెక్కి క్యాంప్ లోని 33/11 కె.వి.సబ్ స్టేషన్ ను రిమోట్ మానిటరింగ్ సబ్ స్టేషన్(ఆర్ఎంఎస్)గా ఆధునికరించి,వరంగల్ లోని ఎస్ సిఎడిఎ( సూపర్ వైజరి సెంటర్ అండ్ డేటా అక్వి జిషన్)సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగింది అని అయన తెలిపారు.ఈ విధానం ద్వారా త్వరలో వరంగల్ నుండి ఆటోమేటిక్ గా సబ్ స్టేషన్ ను మానవ రహితముగా ఆపరేట్ చేయవచ్చు అని ఆయన పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలోబోధన్ డివిజనల్ ఇంజనీర్, ముక్తర్ మోహ్మద్,నిజామాబాద్ డివిజనల్ ఇంజనీర్ టెక్నీకల్ అండ్ ఎంఆర్ టి,కన్స్ట్రాక్షన్ డి. వెంకటరమ ణ,బోధన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె.నాగేష్ కుమార్,ఎడిఈ.ట్రాన్స్ ఫార్మర్స్.నటరాజ్,బోధన్ టౌన్ 2, ఎఈ,కళ్యాణ్,టౌన్ 1,ఎఈ.నాయిని కృష్ణ,ఎఈ.టి ఆర్ఈ.సాయిలు,ఎఈ.సివిల్,కార్తీక్,బోధన్ టౌన్ -2, సిబ్బంది,వినియోగదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.