ఆత్మకు పరమాత్మతో ఉండే పవిత్ర బంధమే రక్షా బంధన్ -బ్రహ్మకుమారీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు -పీసీసీ అధ్యక్షుడికి రాఖీ కట్టిన సునీత బహేన్ జీ

 

 

నిజామాబాద్ సిటీ , ఆగష్టు 27 ( ప్రజాగళం )

 

రక్షా బంధన్ అనేది కేవలం సోదర సోదరీమణుల బంధం కాదని, ఆత్మకు పరమాత్మతో ఉండే పవిత్ర బంధమని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నాందేవ్ వాడ కేంద్రం నిర్వాహకురాలు సునీత బహెన్ జీ అన్నారు. గురువారం బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నాందేవ్ వాడ కేంద్రం ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ లో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కే నగేష్ రెడ్డి, డీసీసీ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ లకు సునీత బహేన్ జీ పవిత్ర దారాన్ని(రాఖీలు) కట్టి మిఠాయిలు అంధించి ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సునీత బహేన్ జీ మాట్లాడుతూ రక్షబంధన్ వేడుకలు పవిత్రతా

బంధానికి ప్రతీక అన్నారు. బురదలో ఉన్న చెడు అలవాట్ల నుంచి తనను తాను రక్షింకోవటం, ఇతరులను రక్షించడం అనే ప్రతిజ్ఞ ఈ రాఖీ పండగ సారాంశమన్నారు. అన్న తమ్ముడు అక్క, చెల్లెలను రక్షించాలనేటటువంటి నానుడి మనదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. కాబట్టి అన్న తమ్ముడు అక్కకు చెల్లికి మాత్రమే రక్షణ కాకుండా దేశంలో ఉన్న ప్రతి మహిళా మూర్తులను రక్షిస్తూ వసుదేవ కుటుంబకంగా వారిని వికారి దృష్టితో చూడకుండా, ఒక ప్రేమ దృష్టితో చూస్తూ ముందుకు వెళ్తే ఈ భారతదేశం సుసంపన్నంగా స్వర్గంగా తయారు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జీవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.