కాషాయ కండువా తియ్యు అంటే ప్రాణాన్ని సైతం లెక్క చేయను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పైర్

 

ప్రజాగళం /నిజామాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 27:

 

నిజామాబాదు లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళి ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రతి బూత్ ని సందర్శించారు. ఈ క్రమంలో ముబారక్ నగర్ లోని పోలింగ్ బూత్ ని సందర్శించే సమయం లో పోలీస్ లు చేరుకొని జిల్లా అధ్యక్షులు దినేష్ మీద ఉన్న కాషాయ కండువా తియ్యుమన్నారు. వెంటనే స్పందించి నా ప్రాణం పోయిన కాషాయ కండువా తియ్యను అని కరకండి గా తేల్చిచెప్పారు. కొద్దిసేపు అక్కడ పోలీస్ వారితో వాగ్వాదం జరిగింది.ఎమ్మెల్సీ ఎన్నికల కు మేము, పోలీస్ లు అన్ని విధాలా సహకరిస్తున్నాం. కానీ పోలీసులు అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ కండువాలు కానీ జెండాలు ఎక్కడ వాడటం లేదన్నారు. కానీ కాషాయ కండువా కప్పుకుంటే ఎందుకు అభ్యంతరం అన్నారు. దయచేసి మా కార్యకర్తల ను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అక్కడ కొద్దిసేపు పోలీస్ ల తో మాటల యుద్ధం కొనసాగింది.

Leave A Reply

Your email address will not be published.