*తెలంగాణలోనే నంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ రావు,స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్* *అభిజిత్ భట్టాచార్య*

హైదరాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్)
తెలంగాణలోని రావు,స్ గ్రూప్ ఆఫ్8 స్కూల్స్ నంబర్ వన్ స్థానంలో నిలిచాయని ముఖ్య అతిథి అభిజిత్ భట్టాచార్య అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని దూలపల్లి కొంపల్లి నందు గల ఇన్నోవియస్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఎప్పుడు తమ ఆలోచనలను నిర్భయంగా తెలుపాలని, నూతన వినూతనమైన అన్ని అంశాలను నేర్చుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2017 సంవత్సరంలో ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో “Be a Job creater not Job Seeker“అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అని తెలిపారు. ప్రతి విద్యార్థి కాన్ఫిడెంట్ గా, బెస్ట్ సిటిజన్ ఉండాలి తన ఆలోచనలను నిర్భయంగా తెలుపాలి అన్నారు. ఎలాంటి క్యాపిటల్ లేకుండా డిజిటల్ ట్రేనింగ్ తో తమ డ్రీమ్స్ ను ఫుల్ ఫిల్ చేసుకోవాలి అన్నారు. రావు,స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ పి. ప్రభాకర్ రావు మాట్లాడుతూ “విద్య వితౌట్ ఇన్నోవేషన్ ఇస్ యూజ్ లెస్” అన్నారు.

విన్నుతనమైన టాలెంట్ ఉంటేనే విద్యార్థులు వారి అభిరుచితో వివిధ రంగాలలో రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ ఐడియాలతో స్టార్ట్ అప్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నారు. రావు,స్ గ్రీఫ్ ఆఫ్ స్కూల్స్ బోధనలు మరియు ఇతర రంగాలలో తెలంగాణలోనే నెంబర్ వన్ గా నిలిచినందుకు గర్వపడుతున్నానని అందుకు సహకరించిన బోధన స్టాప్ కు అభినందనలు తెలిపారు. రాబోవు కాలంలో అమెరికానే జాబుల కోసం ఇండియాకు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి వస్తుందని ఆ విధంగా రావు,స్ స్కూల్ విద్యార్థులు తయారవుతారని విద్యార్థులలో భయము అనేది లేకుండా Rao,s గ్రూప్ స్కూల్స్ విద్యార్థులకు విద్యతో పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మధ్య రాష్ట్ర మాజీ ఐఏఎస్ అధికారి గ్రేడింగ్ విధానం తీసివేయాలని అనడం అవగాహన లేకుండా మాట్లాడడమే అని అన్నారు. ప్రభుత్వ స్కూల్స్ ను స్ట్రేంతెన్ చేయడానికి ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి ఆక్షేపణ తెలపడం లేదని, ప్రభుత్వ స్కూల్ లను మంచిగా నడపలేకనే, ప్రైవేట్ స్కూల్ లకు విద్యార్థులు రాకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇది మంచి నిర్ణయం కాదని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. విద్యార్థులను సాంస్కృతిక రంగంలో తీర్చిదిద్దిన టీచర్స్ ను అభినందించారు.

టీచర్లను ఆకాష్, పృథ్వి, వాయు ,అగ్ని అని నాలుగు విభాగాలుగా విభజించి వారిలో ఉత్తమంగా నిలిచిన ఆకాష్ టీంకు మరియు రన్నర్ గా నిలిచిన పృథ్వి టీంకు ట్రోఫీ కప్ లను అందజేశారు. విద్యార్థులు రోబో డాన్సులు, సేవ్ వాటర్ సేవ్ ఎనర్జీ, ట్రైబల్ డ్యాన్స్, దశావతారాలు, ఐదు రకాల కల్చర్లతో స్టేట్ డాన్స్, పంజాబీ డాన్స్, ఐదు రకాల ఇండియన్ డాన్స్, అరబిక్ మ్యూజిక్ ఎల్కేజీ పిల్లలతో యువావేవ్ డాన్స్ ‘ వాకావాకా’ తదితర సాంస్కృతిక డాన్సులు నిర్వహించి చూపరులను ఆకట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అతిథులు, స్కూల్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు ఎంజాయ్ చేస్తూ వీక్షించారు. వార్షికోత్సవానికి విచ్చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు వారి స్నేహితులు ముఖ్య అతిథులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో CEO P. నిధిన్ రావు, ప్రిన్సిపల్ శాశ్వతి బెనర్జీ,టీచర్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.