*ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపక, పట్టభద్రుల సమస్యల కోసం పోరాడుతా*

ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి :
ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపక, పట్టభద్రుల సమస్యల కోసం పోరాడుతానని పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య అన్నారు. ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో టిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని ఉపాధ్యాయ అధ్యాపక, పట్టభద్రుల సమస్యలపై గత 18 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు అధ్యాపకులు, పట్టభద్రుల అందరి మద్దతుతోటే బరిలో నిలుస్తున్నానని తప్పకుండా అందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటును వేయగలరని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, టిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు టిఎల్ఎఫ్ నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు గజానంద్, టిఎల్ఎఫ్ జిల్లా నాయకులు నవీన్, శ్రీకాంత్, మురళి, విజయ్ , శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.