ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన పోచారం.

బాన్సువాడ, మార్చి 19, ప్రజాగళం.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. బుధవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ.4,73,000 ల చెక్కులను పంపిణీ చేశారు.

మండలాల వారిగా సీఎంర్ఫ్ లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.

బాన్సువాడ గ్రామీణ మండలంలోని ఐదుగురు లబ్ధిదారులకు రూ 67,500,

బాన్సువాడ మున్సిపాలిటీ ఒక్కలబ్ధిదారునికి 60,000,

బిర్కూర్ మండలంలో నలుగురు లబ్ధిదారులకు 1,25,500,నసురుల్లబాద్ మండలం ఐదుగురు లబ్దిదారులకు రూ 2,20,000 అందించారు.

మొత్తం నియోజక వర్గం లో 15 మంది CMRFలబ్ధిదారులకు రూ 4,73,000 అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.