బాన్సువాడ, మార్చి 25, ప్రజాగళం.
బాన్సువాడ మున్సిపల్ తై బజార్ వేలం మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మేకల సంత రూ. 46.26 లక్షలు, రోజువారి సంత రూ. 9.02 లక్షలు, వారాంతపు సంత రూ. 12.31 లక్షలు, దాఖల చిట్టి రూ. 20 వేలకు శంషేర్ ఖాన్, ప్రీతం రెడ్డి, జగన్మోహన్ రావు కాంట్రాక్టర్లు దక్కించుకున్నట్లు కమిషనర్ తెలిపారు.

