చికాగో పోరాట స్ఫూర్తితో రైతాంగ, కార్మిక,ప్రజా సమస్యలపై ఐక్యంగా ఉద్యమిద్దాం కార్మిక వర్గానికి సిపిఐ మే డే శుభాకాంక్షలు

 

ప్రజాగళం/ నిజామాబాద్ ప్రతినిధి మే 01:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139వ మే డే సందర్భంగా అంబేద్కర్ కాలనీలోగల హమాలి యూనియన్ కార్యాలయం ముందు సిపిఐ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం అంటే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని అన్నారు.1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటం మూలంగానే కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు అయిందని, ఆ పోరాట స్ఫూర్తితోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై అందరూ ఐక్యంగా ఉండి పోరాటం నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, బి.రఘు రామ్, ఆలీ ఇమ్రాన్, ఫిరోజ్, అంజలి, దేవేందర్, రాధా కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.