రక్త దానంచేయండి… ప్రాణదాతలుఅవ్వండి.

బాన్సువాడ, జూన్ 11, ప్రజాగళం.

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తే మరొకరి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం రక్తదానం చేసిన ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులకు ను ఆమె సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి చేయాలని, ఇలా రక్తదానం వల్ల ఆరోగ్యసమస్యలుతలెత్తకుండావ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.గర్భిణీ స్త్రీల కోసం రక్తం ఇవ్వడం వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడిన ప్రాణ దాతలు అవుతారన్నారు. స్వచ్చంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు సమాజంకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలన్నారు. రక్తదానం చేసిన ఫౌండేషన్ సభ్యులనుఆమెఅభినందించారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుఅయ్యల సంతోష్,జిల్లా అధ్యక్షులు బంగారురవి,బెజగంసంతోష్, దాత్రిక్ విట్టల్,దడెకర్ సురేష్, మహేందర్,రోటే సాయిలు, బక్రె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.