*నాడు సివిల్ ఇంజనీర్ నేడు లాయర్* *ఎల్ ఎల్ బి పట్టా పొందిన రుద్రప్రతాప్*

ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
నాడు ఇటలీ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి
నేడు లాయర్ గా పట్టా పొందారు రుద్రప్రతాప్. నిజామాబాద్ వినాయక నగర్ కు చెందిన
ఉప్పు సంతోష్- శ్రీ లక్ష్మీ ల పెద్ద కుమారుడు రుద్రప్రతాప్ ఇటలీలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, రుద్ర ఇంటీరియర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో తెలంగాణ లో బిజినెస్ మెన్ గా గుర్తింపు పొంది, న్యాయ రక్షణకై, లా చేసి న్యాయ వాదిగ రాణించాలని, వృత్తి పై ఉన్న ఆసక్తితో ఎల్ ఎల్ బి పూర్తి చేసి హైకోర్టులో ప్రమాణం చేసి పట్టా పొందాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పు సంతోష్ మాట్లాడుతూ..ఒక్క తండ్రిగా గర్వపడుతున్నానని, ప్రజలకు సేవ చేయాలని, న్యాయాన్ని కాపాడాలని ఈ వృత్తి ఎంచుకున్నదుకు సంతోషంగా ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.