*అంగరంగ వైభవంగ 838వ మహా గాయత్రి యజ్ఞం*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల వరకు స్థానిక రోటరీ నగర్ నందుగల గాదే మారుతి గుప్త దంపతుల ఇంటి యందు 838 వ మహా గాయత్రీ యజ్ఞం నిర్వహించడం జరిగిందని ఇందూరు యజ్ఞ సమితి అధ్యక్షులు డాక్టర్ మూడ నాగభూషణం గుప్త తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజ్ఞం వీక్షించిన వారికి యజ్ఞం పీటల మీద కూర్చున్న వారికి ఇంటిల్లిపాది అందరికీ దుక్కాలు తొలగి సుఖశాంతులతో జీవిస్తారని వారి వ్యాపారాలు ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయని పిల్లలు చదువులలో రాణిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిటుకుల భూమయ్య గుప్త, మాధవరావు, డెమివార్ సంతోష్ కుమార్ అనిత, సిహెచ్ ఈశ్వర చరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.