నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
100ఫీట్ బైపాస్ రోడ్ నందు గల RKR అపార్ట్మెంట్ వాసులు దాని ఎదుట ఉన్న మా జాగాను కబ్జాకు పాల్పడుతున్నారని జాగా ఓనర్ కొండూరి నగేష్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను వృత్తిరీత్యా హైదరాబాదులో ఉంటున్నానని RKR అపార్ట్మెంట్ పక్కన ఆనుకుని గల 235 గజాల ప్లాటు సర్వే నెంబరు 219 అరుణ్ కుమార్,ననిత, పాండురంగారెడ్డి ముగ్గురo కలిసి ప్లాట్ ప్లాట్ కొనడం జరిగిందని తెలిపారు. RKR అపార్ట్మెంట్ వాసులు మా 235 గజాల ప్లాట్ ల నుండి తోవ తీశారని తెలిసి నిజామాబాద్ కు వచ్చి తోవను మూసివేసి ప్రయత్నం చేయగా నాపై గోపి, మల సంఘం వ్యక్తులు, అనుచరులు దుర్భాషలాడుతూ కొట్టేంత ప్రయత్నం చేశారని కొండూరి నగేష్ కుమార్ తెలిపారు. మా జాగా కబ్జా చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. పక్కన ఉన్న నాలాకు మా జాగాకు ఎలాంటి సంబంధం లేదని, సంబంధం ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ LRS & బిల్డింగ్ కటేందుకు ఎలా పర్మిషన్ ఇస్తుందని ప్రశ్నించారు. Rs11,850 రూపాయలు ఎల్ఆర్ఎస్ మరియు పర్మిషన్ కు మార్చ్ లో కట్టి పర్మిషన్ తీసుకున్నామని తెలిపారు. గోపి మరియు RKR అపార్ట్మెంట్ వాస్తులపై తగిన చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిన్న గురువారం మీడియాలో వచ్చిన దానికి కౌంటర్ గా నేడు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని తెలిపారు. తన వెంట RKR అపార్ట్మెంట్ బిల్డర్ సతీష్ అటల్ కుమారుడుప్రణయ్ అటల్, BRS నాయకులు తెలంగాణ శంకర్ ఉన్నారని తెలిపారు. నా ప్లాట్ తో టిఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రావుకు సంబంధం లేదన్నారు. RKR అపార్ట్మెంట్ కు రెండు దిక్కుల గేట్లను పెట్టారని మా జాగాల కెళ్ళి పోకుంటే ఒక గేటు బందు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటిదాకా నేను హైదరాబాదులో ఉంటిని ఎలాంటి నిర్మాణం చేయలేదు. ఖాళీజాగా ఉన్నప్పుడు నడుస్తే నడువని అని ఊరు కున్నాను అన్నారు. ఇప్పుడు నా మీదకే జాగా RKR ది, ప్రభుత్వ రోడ్ అంటూ RKR అపార్ట్మెంట్ వాసులు ఎదురు తిరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గోపి అనే వ్యక్తి అందరిని మిస్ గైడ్ చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా అటల్ ప్రాజెక్ట్స్ యజమాని ప్రణయ్ అటల్ మాట్లాడుతూ RKR అనే పేరు ఏ పార్టీకి సంబంధించింది కాదని అందులో ఉన్న వాసులందరూ కావాలంటే ఇష్టం ఉన్న పేరు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మేము ఓన్లీ బిల్డర్స్ మాత్రమే అని అన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు తెలంగాణ శంకర్ మాట్లాడుతూ ప్రైవేట్ తగాదాలకు టిఆర్ఎస్ నాయకులను గుంజ వద్దని అన్నారు. RKR అపార్ట్మెంట్ కు టిఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రావుకు, MLC కల్వకుంట్ల కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలని పేపర్లకు లాగడం ను తీవ్రంగా ఖండించారు. BRS పార్టీని నాయకులను బాదనాం చేసే చర్యలకు పూనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

