*నమ్మించి మోసం చేశారు.* *దారి ఉందని రోడ్డున పడేస్తున్నారు.* *ఆర్ కే ఆర్ అపార్ట్మెంట్స్ వాసుల ఆవేదన*

నిజామాబాద్ అర్బన్ డిసెంబర్ 13 ప్రజాగళం

నిజామాబాద్ కలెక్టరేట్ బైపాస్ రోడ్ లో గల ఆర్ కె ఆర్ అపార్ట్మెంట్స్ కు బైపాస్ రోడ్డు నుండి దారి ఉందని నమ్మించి అపార్ట్మెంట్స్ లోని ప్లాట్ లను అమ్మి బిల్డర్ మోసం చేశాడని ఆర్కే ఆర్ అపార్ట్మెంట్స్ వాసులు ఆరోపించారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామ రామ్ కిషన్ రావు తన అనుచర బలగంతో బెదిరిస్తూ అపార్ట్మెంట్స్ వైపు ఉన్న ప్రధాన రోడ్డుని కబ్జా చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అపార్ట్మెంట్ నివాసితుల పైన దాడులకు పాల్పడుతున్నారన్నారు. గురువారం ప్రెస్ క్లబ్ లో నగేష్ అనే వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి ఇది తన వ్యక్తిగత విషయమని ఇందులో కవిత కుటుంబానికి వాళ్ల మామకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అతను చూపించిన డాక్యుమెంట్లలో అతనితో పాటు రాం కిషన్ రావు కొడుకు అరుణ్, కోడలు, మరొక వ్యక్తి ఉన్నట్లు ఆధారాలు చూపించారు. రోడ్డు ఉందని నమ్మించి, నాణ్యత లేకుండా అపార్ట్మెంట్స్ను నిర్మించి తమకు అప్పగించిన అటల్ బిల్డర్స్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు ఆదెప్రవీణ్ ఆర్కేఆర్ అపార్ట్మెంట్స్ వాసులకు సంఘీభావం తెలుపుతూ కల్వకుంట్ల కుటుంబం కబ్జాలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అపార్ట్మెంట్స్ రోడ్డు విషయమై నిజామాబాద్ నగర మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గోపి, ప్రవీణ్ లతో పాటు ఆర్కేఆర్ అపార్ట్మెంట్స్లోని ప్లాట్స్ యజమానులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.