ప్రజా గళం క్యాలెండర్ ఆవిష్కరణ.

బాన్సువాడ టౌన్, ప్రజాగళం. ప్రజాగళం నూతన సంవత్సర క్యాలెండర్ను బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, బాన్సువాడ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవారం సాయిరెడ్డి లు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతకాలంలోనే పత్రిక ప్రజల్లోకి చొచ్చుకుపోయిందని అన్నారు. నిర్భయంగా, నిజాయితీగా వార్తలు ప్రచురించి, పాఠకులకు మరింత చేరువ కావాలని సూచించారు. ప్రజా సమస్య ల ఫై దృష్టి పెట్టి, మంచి కథనాలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాగళం కామారెడ్డి ప్రతినిధి, యండమూరి వరప్రసాదరావు, ప్రజాగాళం సీనియర్ రిపోర్టర్ హనుమాన్లు, సక్షన దేవరాజ్, బాల సాయిలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.