నిజామాబాద్,సెప్టెంబర్ 15, ప్రజాగళం:
వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి మంగళవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా, వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. విఘ్నాలు తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుని కృపతో అంతటా శాంతి సౌభాగ్యాలు సమకూరాలని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

