అందుల జీవితంలో వెలుగులు నింపిన “లూయి బ్రెయిలీ” అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
అందులకు చదువు నేర్చుకునేందుకు లిపిని తయారుచేసిన వ్యక్తి లూయి బ్రెయిలీ అని కొనియాడారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా స్థానిక మారుతీ నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందుల పాఠశాల యందు లూయి బ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించి రేక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు కంటిచూపు కోల్పోయి చదువుకోవాలని తపనే లిపి ని తయారు చేసి ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా ఎదిగాడని కొనియాడారు. అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిలీ అని తనతో పాటు తోటి అంధులైన వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే తపనతో అందుల కోసం ప్రత్యేక లిపిని తయారు చేసారని విద్యార్థులు కూడా లూయి బ్రెయిలీ నీ ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయిలో నిలువాలని సూచించారు. నేడు వివిధ ప్రభుత్వ శాఖల్లో అందులు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆనాడు లూయి బ్రెయిలీ అందించిన లిపి కారణం అన్నారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం గట్టిగా ఉంటే అనుకున్న లక్ష్యం తప్పకుండా చేరుకుంటాం అన్నారు.

అనంతరం అంద విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, GGH Supdt. డాక్టర్ ప్రతిమరాజ్, MEO వెంకట నారాయణ గౌడ్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య , బిజెపి నాయకులు సాయిరాం, శ్రీధర్ అందుల ఎంప్లాయిస్ సంఘ అధ్యక్షులు సాయన్న, సాగర్ ,ఆరోగ్యరాజు, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.