బాన్సువాడ టౌన్ ప్రజా గళం: రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీష్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ శనివారం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మరియు ఇంచార్జి కలెక్టర్ ను వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆగ్రో ఇండస్ట్రీష్ సంస్థకు చెందిన భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని, కబ్జా చేసిన భూములను తిరిగి ఆగ్రోస్ సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

