బాన్సువాడ టౌన్ ప్రజా గళం: బాన్సువాడ పట్టణం నూతనంగా నిర్మాణం చేపట్టిన 100పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా 37.50 కోట్లతో ఆసుపత్రి భావన నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యత లోపం లేకుండా చూడాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

