వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు అపహరణ

ప్రజాగళం , నిజామాబాద్ క్రైం : తెల్లవారుజామున ఇంటి ఎదుట వాకిలి ఊడుస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గెలుసు ఎత్తుకెళ్లిన ఘటన నగరంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గౌతమ్ నగర్ లో అనసూయ అనే మహిళ నివాసం ఉంటుంది. ఎప్పటిలాగే శనివారం తెల్లవారు జామున తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ సమయంలో ఒక దుండుగుడు అటువైపు నడుచుకుంటూ వచ్చి వృద్ధురాలి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.