చైనా మంజా అమ్మటానికి ప్రయత్నిస్తున్న రెండు షాపులపై కేసులు నమోదు
నిజామాబాద్ జనవరి 05(ప్రజా గళం క్రైమ్)
చైనా మాంజా అనేది ప్రాణహాని కలిగించే వస్తువు లేదా దారం ఇటువంటి చైనా మాంజను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా బజార్ లో గల రెండు కైట్ షాపులపై కేసులు నమోదు చేశామని రెండవ టౌన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజాను అమ్ముకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేదు కానీ కొంతమంది అధిక డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో చైనామాంజను తమ షాపులలో అమ్ముటకు ప్రయత్నం చేస్తున్నారు. బడా బజార్ లో గల రెండు షాపులపై ఎన్ కే కైట్ షాప్, సుల్తాన్ కైట్ షాప్ లో గల దుకాణాలపై రెండవ టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో ఎన్ కె కైట్ షాప్ లో 4000 రూపాయల విలువ చేసే 4 దారపు ఉండలు , అలాగే సుల్తాన్ కైట్ షాపులో5000 రూ విలువచేసే 5 బండెల్స్ పట్టుబడ్డాయి. ఆ రెండు షాపు యజమానులపై భారతీయ న్యాయ సంహిత మరియు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. చైనా మాంజా ఎవరు అమ్మిన అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడునని రెండవ టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు.
