బాన్సువాడ రూరల్, ప్రజా గళం.
ప్రతి సంవత్సరం రెండు పంటలకు 15000 వేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క రైతుల ఖాతాలో కూడా రూపాయి వేసిన పాపనా పోలేదు,అందుకు నిరసనగా ప్రతి గ్రామాలలో రైతులకు చేసిన మోసాన్ని తెలుపుతూ పోస్టర్లు అతికించడం జరుగుతుందని తెరాస నాయకులు తెలిపారు. ఆదివారం తెరాస నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎగ్గొట్టిన రైతుబంధు ఎప్పుడు.. అంటూ వాల్ పోస్టర్లను పట్టుకొని నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని, ప్రతి రైతుకు తెలియజేయడానికి వాల్ పోస్టర్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లు అంటిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో తెరాస బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మోచి గణేష్ నాయకులు శివ సూరి, అనిల్, లక్ష్మణ్, రాజ్ కుమార్ దిలీప్ రమేష్, సాయి, అనీష్, హనుమాన్లు, రజనీకాంత్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

