ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్.

నిజామాబాద్ బ్యూరో జనవరి 06 ( ప్రజాగళం )

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.