బాన్సువాడ టౌన్, ప్రజాగళం:
ప్రజాగళం నూతన సంవత్సర క్యాలెండర్ను నసురుల్లాబాద్ మాజీ ఎంపీపి విఠల్ ఆవిష్కరించారు. సోమవారం నస్రుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో క్యాలెండర్ ని ఆవిష్కరించి మాట్లాడారు. నిజాయితీ, నిర్భయంగా వార్తలు రాయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే కథనాలతో విలేకరులకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్తాపత్రికలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏ లాంటి ప్రలోభాలకు గురికాకుండా, వార్తలు సేకరించి, ప్రచురించాలని సూచించారు. ప్రజాగళం దినపత్రిక అనతి కాలంలోనే పాఠకుల్లోకి చొచ్చుకుపోయిందని అన్నారు. పత్రిక విలువలు కాపాడుతూ విలేకరులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాగళం కామారెడ్డి ప్రతినిధి, యండమూరి వరప్రసాదరావు, రిపోర్టర్ సక్షేన దేవరాజ్, సంగం వార్డ్ మెంబర్ బాలయ్య, యూత్ సభ్యులు బి.మోహన్, సంజీవ్, సతీష్ శంభు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

