డొంకేశ్వర్ మండలంలో బాలిక ఆత్మహత్య యత్నం.

-ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

 

నిజామాబాద్, జనవరి 07( ప్రజాగళం ప్రతినిధి )

డొంకేశ్వర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక(16) ఆత్మహత్యకు యత్నించింది. పదో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 5న గడ్డి మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడి వేధింపులతోనే బాలిక ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.