నిర్మల్ /ముధోల్ (ప్రజాగళం అర్బన్):
జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గురువారం ముధోల్ మండల కేంద్రంలోని జెడ్ పి ఎస్ ఎస్ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బడికి రానీ పిల్లల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చేయాలని ఆదేశించారు. మహిళ పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయునీలు బాలికలను తమ పిల్లలుగా భావించి చదువు చెప్పాలని వారికి పదో తరగతి ఉత్తీర్ణులవడం ఎంత ముఖ్యమో సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ తో పాటు సెక్టోరియల్ అధికారి రాజేశ్వర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

