నిజామాబాద్ జనవరి 24 ( ప్రజా గళం ప్రతినిధి):
అనతి కాలంలోనే ప్రజా గళం దినపత్రిక ప్రజాధరణ పొందడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ గుప్తా అన్నారు. తెలుగు దినపత్రిక ప్రజా గళం 2025 క్యాలెండర్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ప్రజాగుళం క్యాలెండర్ ను ఆవిష్కరించి పత్రిక యజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగకరమైన వార్తలను ప్రచురించి సమాజ సేవకు పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పత్రిక పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి,,అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి నవ సమాజ స్థాపన కోసం పని చేయాలన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా గళం సీఈవో k.రాజ్ కుమార్, పత్రిక ఎడిటర్ కొక్కు రవికుమార్, సీనియర్ జర్నలిస్టు కొట్టూర్ శ్రీనివాస్, ప్రజాపక్షం జిల్లాప్రతినిధి కర్క రమేష్, విజన్ ఆంధ్ర రిపోర్టర్ పబ్బు భూమేష్, జర్నలిస్ట్ నరసయ్య, ఉమామహేశ్వర్, సాక్షర పత్రిక జిల్లా ప్రతినిధి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

