మద్నూర్, ప్రజాగళం:
ప్రజా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు జాబితాలోలేకున్నప్పటికీ,ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులు ఎంపిక నిరంతర ప్రక్రియ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం నిర్వహిస్తున్న గ్రామసభలలో భాగంగా శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ప్రజా పాలన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావుమాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందాలనే ఉద్దేశ్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైనవారిజాబితారూపొందించడం జరిగిందన్నారు.జాబితాలో పేరు లేని వారు ఎటువంటి ఆందోళన చెందల్సిన అవసరం లేదని,లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియఅనివివరించారు. జాబితాలో పేర్లేని అర్హులైన లబ్దారులు గ్రామ సభలో కానీ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

