ఆర్మూర్ జనవరి, 26 (ప్రజాగళం):
ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చివరి సర్వసభ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస అధ్యక్షతన ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆర్మూర్ అభివృద్ధికి కృషి పాలకవర్గం చివరి సమావేశం అయినందున తనతో కలిసి నడిచిన కౌన్సిలర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ మున్ను, కౌన్సిలర్లను సన్మానించారు, కార్యక్రమం లో పాల్గొన్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భముగా వినయ్ కుమార్ రెడ్డిని మున్సిపల్ పాలకవర్గం వారు శాలువా తో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.

