మద్నూర్, ప్రజాగళం:
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎస్ఐ శంకర్ ను గ్రామస్తులు అభినందించారు. మద్నూర్ మండలం పెద్ద ఎకర్ల గ్రామానికి చెందిన శంకర్,మెదక్ జిల్లా శంకరంపేట లో ఎస్ఐ గా విధులునిర్వహిస్తున్నారు.ఆయనకు ఉత్తమ సేవా పురస్కారం రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సమక్షంలో ఎస్సైని అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. పెద్ద ఎకర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఉత్తమ సేవా పురస్కారం కు ఎంపికకావడంఅభినందినీయమని, విధి నిర్వహణలోనిజాయితీగా ఉండే వారికి పురస్కారం లభించడం గ్రామానికి గర్వకారణం అని గ్రామ పెద్ద హనుమంతరావు దేశాయి పేర్కొన్నారు.

