నిజామాబాద్ స్పోర్ట్స్ జనవరి 28 (ప్రజా గళం )
స్వర్గీయ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర కుమార్ 34 వర్ధంతి పురస్కరించుకొని జర్నలిస్టు మిత్రులకు ఏర్పాటుచేసిన షటిల్ పోటీలను మంగళవారం ఆఫీసర్స్ క్లబ్ లో కార్యదర్శి స్వామిదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు మిత్రుడు నరేంద్ర జ్ఞాపకార్ధంగా గత 34 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యు లను, జర్నలిస్ట్ మిత్రులను ఆయన అభినందించారు. నిరంతరంగా వర్ధంతి సందర్భంగా పోటీలు నిర్వహించడం అనేది ఎంతో గొప్ప విషయమని, బహుశా ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలేని విధంగా ఇక్కడ పోటీలు నిర్వహించడం వారికి సాధ్యం అయింద ని అన్నారు. ఈ కార్యక్రమంలో
స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి. సాయిలు, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోశాధికారి సందీప్ గౌడ్, జర్నలిస్టు సంఘాల నాయకులు బొబ్బిలి నరసయ్య చింతల గంగదాసు జెట్టీ గోవింద్ రాజు, ధనుంజయ్, పాకాల నరసింహులు, మల్లెపూల నరసింహ చారి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన షటిల్ క్రీడా పోటీల్లో పి శ్రీకాంత్, భాను తేజ జట్టు గంగా దాస్, దశరథ్ జట్టుపై గెలుపొంది విజేతలుగా నిలిచారు.

