కామారెడ్డి, ప్రజా గళం:
పైసా, పైసా, పైసా ఈ పైసా మానవ సంబంధాలను మట్టిలో కలిపివేస్తుంది. డబ్బు కోసం ఎంత దారుణానికైనా వొడి కొడుతున్నారు. డబ్బులు కోసం కన్నతల్లిని కడతేర్చాడు ఒక కసాయి కొడుకు.వివరాలు ఇ లాఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గం పొతంగల్ మండలంలోని జల్లపల్లి గ్రామంలో డబ్బుల కోసం తల్లిని హతమార్చాడు ఓ కసాయి . స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన నేనావత్ రాములు వ్యసనాలకు బానిసై తన తల్లి మంగ్లీ భాయిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె వద్దనున్న కొంత నగదు, వెండి ఆభరణాలను బలవంతంగా లాక్కొనికొట్టిచంపేశాడు. మృతదేహాన్ని గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద ఉన్న గుంతలో పడవేసి జారుకున్నాడు. సంఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
