ఎడపల్లి,జనవరి 29 (ప్రజా గళం):
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపే ట గ్రామంలో మంగళవారం రాత్రి ఓ వృద్ధుడు అనుమానస్పదంగా ధారుణ హత్యకు గురయ్యా డు.బోధన్ రూరల్ సిఐ.డి.విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం…ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బత్తుల నర్సయ్య(68)అనే వృద్ధుడు ఎస్సి కాలనీలో నివసిస్తున్నాడు.బత్తుల నర్సయ్యతో కొడుకు రాజశేఖర్ తరచూ గొడవ పడుతుంటాడని సమాచారం.మంగళవారం కూ డా తండ్రి కొడుకులు గొడవ పడినట్లు స్థానికుల ద్వారా తెలిసింది.నర్సయ్య రోజు కూలీ పనులు చేసుకుంటాడని పోలీసులు తెలిపారు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నర్సయ్యను ఇంట్లో ధారుణంగా హత్య చేశారు.నర్సయ్య రక్తపు మడు గులో పడి మరణించి ఉన్నాడని పోలీసులు తెలి పారు.వాస్తవంగా నర్సయ్య హత్య ఎలా జరిగిం దనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తండ్రిని కొడుకే హత్య చేసి ఉంటాడని ?. పోలీసులు,స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి బోధన్ రూరల్ సిఐ.విజయ్ బాబు,ఎడపల్లి ఎఎస్ఐ.ఎండి.ఇలియాస్ లు చేరుకున్నారు.హత్య ఘటనఫై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ.విజయ్ బాబు తెలిపా రు.హత్యకు కారణాలు తెలియాల్సిన ఉందని, అన్నారు. ఈ సందర్బంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
