బాన్సువాడ టౌన్, ప్రజాగళం. బాన్సువాడ పట్టణంలోని కోటగల్లీలోని దుర్గామాత ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపడతారు. మంగళవారం ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజాకార్యక్రమాలునిర్వహించారు. పద్మ రాజమణి కాశీరాం, పద్మా లావణ్య నరేష్ లు అన్నదాన కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు. అమ్మవారి సేవలో తరించే భక్తులకు దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పత్తి శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

