నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 04( ప్రజగళం )
అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలొ పురుషుల కంటే మహిళలే వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్ నెగ్గడంలో తెలంగాణ రాష్ట్రం భద్రాచలం కు చెందిన “గొంగడి త్రిష”ను అభినందించక తప్పదు. టోర్నీ ఆధ్యాంతం విశేషంగా రాణించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత గొంగడి త్రిష ది . టోర్నమెంట్ మొత్తం లో 309 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించడంలో త్రిష పాత్ర చాలా కీలకం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదని, పట్టుదలతొ ఆడితే విజయం చాలా సులభమని నిరూపించింది గొంగడి త్రిష.ప్రపంచ పొట్టి కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా అవార్డు సాధించి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతీని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొంగడి త్రిషకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

