రాష్ట్ర మహిళా పోలీస్ కబడ్డీ జట్టులో చోటు.

 

ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:

ఏర్గట్ల మండలంలోని బట్టా పూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి ల కూతురు గోదావరి కి రాష్ట్ర మహిళా పోలీస్ కబడ్డీ జట్టులో చోటు దక్కింది. మార్చి 2నుండి 6 వరకు పంజాబ్ రాష్ట్రం లోని జలంధర్ లో జరిగే జాతీయ స్థాయి పోలీస్ మహిళల కబడ్డీ పోటీలో పాల్గొననున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కోచ్ మీసాల ప్రశాంత్, పోలీస్ అధికారులు,సీనియర్ క్రీడాకారులు,వ్యాయమ ఉపాధ్యాయులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.