ప్రజాగళం నిజామాబాద్ ఫిబ్రవరి 27..
హర్యానాలో బివాని వేదికగా ఈనెల 23 నుండి 26 వరకు జరిగిన
37వ జూనియర్ నేషనల్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ 2024- 2025 పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు ప్రతిభ చాటి రజత పతకం సాధించింది. నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బగ్గలి మహిమ తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అతి చిన్న వయసులో రాష్ట్ర జట్టులో సభ్యురాలుగా ఉంటూ సత్తా చాటిన క్రీడాకారిణి బగ్గలు మహిమను, పి ఈ టి కృష్ణంరాజును పలువురు అభినందించారు. తమ గ్రామానికి చెందిన క్రీడాకారిణి రాష్ట్ర జట్టులో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ సాధించడంతో సారంగాపూర్ గ్రామ ప్రజలు , తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగి పోయారు. క్రీడాకారిని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమ కూతురి విజయంలో కీలకపాత్ర పోషించిన పిటి కృష్ణంరాజు కు తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

