మద్నూర్, ఫిబ్రవరి 27, ప్రజాగళం. పట్టభద్రుల, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలు మద్నూర్ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని మద్నూర్ తాసిల్దార్ ముజీబ్ వివరించారు. పట్టభద్రుల పోలింగ్ శాతం 75.29 నమోదైనట్లు తెలిపారు. 417 మంది ఓటర్ల గాను 314 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల ఓటర్ల శాతం 93.87 నమోదయిందని, 49 మంది ఓటర్లలో 46 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

